మేము అన్నీ రకాల వివాహ, ఉపనయనాది శుభకార్యాలు శాస్త్రోక్తముగా, వేదోక్త పద్ధతిలో చేయించగలము.
అదే విధంగా ప్రతీ సంవత్సరము మాధవపురి కాలనీ (సైనిక్ పురి, Sec-Bad) మా నివాస గృహము నందు క్రింది కార్యక్రమాలు భక్తుల సహకారంతో జరుగుచున్నవి:
- భాద్రపద మాసము లో వచ్చే గణపతి నవరాత్రులలో 1108 ఉండ్రాళ్ళతో లక్ష్మీ గణపతి హోమము
- ఆశ్వీయుజ మాసము లో వచ్చే దేవీ నవరాత్రులలో ప్రతీ రోజూ చండీ హోమము
- కార్తీక మాసము లో స్వామి వారికి సహస్ర లింగార్చన
- ధనుర్మాసము లో సుదర్శన హోమము
- మాఘ మాసము లో ప్రతీ ఆదివారము సూర్య నమస్కారములు
భక్తులు ఈ అవకాశమును కూడా వినియోగించుకోవచ్చును.
భక్తుల యొక్క పుట్టినరోజు, పెళ్ళి రోజు లేదా ఇతర విశేష పర్వదినములందు తమ గోత్ర నామములతో హోమాలు, అభిషేకాలు, వేద ఆశీర్వచనాలు చేయించుకోదలచిన వారు ముందుగా తెలుపగలరు.
జాతక విశ్లేషణ
భక్తులు తమ యొక్క జాతకము గురించి తెలుసుకోదలచిన వారు మమ్ములను సంప్రదించి క్రింది వివరాలు తెలియజేయగలరు:
- పేరు
- పుట్టిన సమయము
- పుట్టిన తేదీ
- పుట్టిన స్థలము
క్రింది అంశాల గురించి వివరముగా తెలుసుకోవచ్చు:
- 1. వివాహము
- 2. వ్యాపారము మరియు ఉద్యోగము
- 3. ఆరోగ్యము
- 4. అన్యోన్య దాంపత్యము
- 5. సంతానము
ఏవైనా గ్రహ నక్షత్ర దోషాలు ఉన్నచో జప, తర్పణ, హోమ, శాంతి కార్యక్రమాలు చేయించగలము.